ప్రాథమికోన్నత పాఠశాల - చిన్నవంగర
పాఠశాల పున: ప్రారంభ ఆహ్వానం
గౌరవనీయులైన
తల్లిదండ్రులకు, విద్యాభిమానులకు, నమస్కారములు.
పాఠశాల వేసవి సెలవుల అనంతరం, రేపు అనగా జూన్ 12, గురువారం రోజున పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు పాఠశాల తరుపున ఆహ్వానం పలుకుతున్నాము. మన పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ల పంపిణీ జరుగుతుంది. అలాగే తరగతుల ప్రారంభం జరుగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.
నేడే అడ్మిషన్లు ప్రారంభమైనవి.......
ఇట్లు
ప్రాథమికోన్నత పాఠశాల – చిన్నవంగర
ప్రధానోపాధ్యాయులు,
AAPC, ఉపాధ్యాయ
బృందం
No comments:
Post a Comment