Badi Bata Karapatram (Enrollment Drive pamphlet)
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
గ్రామం: చిన్నవంగర, మండలం: పెద్దవంగర, జిల్లా: మహబూబాబాద్.
ఆంగ్ల మాధ్యమం (ENGLISH MEDIUM) ఉచిత విద్య (FREE EDUCATION)
గౌరవ తల్లిదండ్రులకు విద్యాభివందనములు!
విద్య ఒక సామాజిక అవసరం.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ కృత్రిమ మేదస్సు (AI)
తో నాగరిక పోటీ ప్రపంచంలో మనిషి మనుగడకు, మానవ
విలువలకు విద్య యొక్క పాత్ర అమూల్యమైనది. శాస్త్ర, సాంకేతిక పరమైన
కోర్సులను అభ్యసించడానికి "ఆంగ్ల మాధ్యమం” లో విద్య అవశ్యకమైనది.
నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రభుత్వేతర పాఠశాలలో వివిధరకాల అందమైన పేర్లతోఫీజులు
వసూలు చేస్తూ తల్లితండ్రులను తీవ్ర ఆర్థిక, మానసిక
ఇబ్బందులకు గురి చేసున్నాయి. తల్లిదండ్రులు తమ సంపాదనలో అధిక భాగం ప్రైవేట్ పాఠశాలలో
పిల్లల చదువు కొరకు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలను మానసిక ఉల్లాసం లేని మర యంత్రాలుగా
తయారు చేస్తున్నారు.
మా ప్రత్యేకతలు:
- ప్రతి సంవత్సరం 2 ఉచిత ఏకరూప దుస్తులు (యూనిఫామ్స్)
- ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మరియు వర్క్ బుక్స్
- విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేకుండా ఆంగ్ల మాధ్యమంలో పూర్తిగా విద్యా బోధన.
- ఉన్నత విద్యార్హతలు, అపార అనుభవం, సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం.
- ఉచిత మధ్యాహ్న భోజనం, రుచికరమైన పౌష్టికాహారం, వారానికి (3) రోజులు గుడ్లు, రాగిజావ.
- నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE).
- విద్యార్థులకు చక్కని గ్రంథాలయ సౌకర్యం.
- ప్రతి పాఠ్యాంశ బోధనానంతరం పరీక్షల నిర్వహణ. ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు పంపించడం.
- ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశములో విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయుల ముఖాముఖి.
- క్రీడా, సాంస్కృతిక మరియు సృజనాత్మక రంగాలలో ప్రత్యేక శిక్షణ.
- స్మార్ట్ స్క్రీన్, TLM ద్వారా విద్యా భోధన • ప్రతి రోజు యోగ, మెడిటీషన్, ఎక్సర్సైజ్ చేయించబడును.
- రైమ్స్, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీష్.
- 1-8వ తరగతి వరకు విద్యాభోధన.
- స్వచ్చంద సంస్థలు, దాతల సహకారంతో పాఠశాల సుందరీకరణ,
విద్యార్థులకు అదనపు అవసరాలు తీర్చడం.
విశేష అనుభవం కలిగిన మా ఉపాధ్యాయ బృందం:
- G. దేవదాసు, B.A., B.Ed, HM SA (Social)
- J. రాజు, M.A., TPT SA (Telugu)
- G. నిఖిల్, B.Sc., B.Ed. SA (Bio-Sci)
- K. వెంకటేశ్వర్లు, M.Sc., B.Ed. SGT
- V. శ్రీనివాస్, M.Sc., B.Ed. SGT
- J. యాకూబ్ రెడ్డి, B.Sc., B.Ed. SGT
- V. ప్రకాష్, M.Sc., B.Ed. SGT
- D. ప్రకాష్, B.Sc., B.Ed. SGT
నాణ్యమైన విద్యకోసం మీ పిల్లలను
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి.
ప్రభుత్వ బడులలో చదువులు
- మీ పిల్లల భవితకు వెలుగులు.
ఫీజులు ఎందుకు దండగ
- ఆంగ్ల మాధ్యమం మనఊరిలో ఉండగ...
సర్కారు
బడిలోనే చదివించండి - పిల్లల జీవితాలలో వెలుగుని పెంచండి.
గ్రామాలలో పాఠశాలలు - దేశానికి పట్టుగొమ్మలు.
మన
ఊరు మన బడిని మనమే కాపాడుకుందాం.
ప్రధానోపాధ్యాయులు
& ఉపాధ్యాయ బృందం,
అమ్మ ఆదర్శ పాఠశాల
కమిటి,
గ్రామం: చిన్నవంగర, మండలం: పెద్దవంగర.
No comments:
Post a Comment