డిజిటల్ తరగతులు ప్రారంభం: చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం తేదీ : 07-07-2019 న డిజిటల్ తరగతులు ఇన్ఛార్జి ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, సర్పంచ్ లక్ష్మి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వినడం కంటే తెరపై చూడటం ద్వారా పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయన్నారు. విద్యార్థులు నూతన సాకేంతిక విద్యావిధానాన్ని శ్రద్ధతో వినియోగించుకుని చదువుల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు వారు ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

పేద విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, సన్నబియ్యం తో పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు చెప్పే మాటలు నమ్మి తమ పిల్లల జీవితాలను ఆగం చేయొద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయుడు ఉంటారన్నారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ సభ్యురాలు సౌజన్య, ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, శ్రీనివాస్, ప్రకాష్, యాకూబ్ రెడ్డి, అజయ్ కుమార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment