తేదీ 18-06-2018 న UPS Chinnavangara పాఠశాలలో Quiz Competitions ని విద్యార్థులకు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమమునకు
సంబంధించిన ఫోటోలని మరియు విద్యార్థులకు Quiz Competitions లో భాగముగా అడగబడిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ విద్యార్థులు కొరకై పొందు పరుస్తున్నాము. మొదటి విజేత గా D Group విద్యార్థులు నిలిచారు.
గణితమునకు సంబంధించిన ప్రశ్నలు :
సంబంధించిన ఫోటోలని మరియు విద్యార్థులకు Quiz Competitions లో భాగముగా అడగబడిన కొన్ని ప్రశ్నలు ఇక్కడ విద్యార్థులు కొరకై పొందు పరుస్తున్నాము. మొదటి విజేత గా D Group విద్యార్థులు నిలిచారు.
గణితమునకు సంబంధించిన ప్రశ్నలు :
- p/q రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను ఏమని పిలుస్తాము?
- సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం ఏమిటీ?
- -5 యొక్క సంకలన విలోమం ఏమిటి?
- గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం ఏమిటి?
- ⅗ యొక్క గుణకార విలోమం ఏమిటి?
- 3⅗ కి అపక్రమ భిన్న రూపం చెప్పండి?
- 0.45 కి p/q రూపం చెప్పండి?
- a(b+c) కి గుణకార విభాగ న్యాయం ప్రకారం విడదీసి చెప్పండి?
- తిర్యాగ్రేఖ కు ఒకే వైపున గల అంతర కోణాల మొత్తమెంత?
- నేనొక సంఖ్యను… దానిని రెట్టింపు చేసి ఫలితం నుంచి 7 ను తీసివేస్తే 35 వచ్చింది? దీనికి సమీకరణము చెప్పండి?
- 75y లో చర రాశి ఏది?
- 45z లో స్థిర రాశి ఏది?
- దీర్ఘ చతురస్రం చుట్టుకొలత కి సూత్రం చెప్పండి?
- రెండు కోణాలు సంపూరకాలు, అయితే అందులో ఒక కోణం 75 డిగ్రీలు, రెండవ కోణం ఎన్ని డిగ్రీలు?
- రెండు కోణాలు పూరకాలు, అయితే అందులో ఒక కోణం 35 డిగ్రీలు, రెండవ కోణం ఎన్ని డిగ్రీలు?
- ఒక త్రిభుజము యొక్క బాహ్యకోణం 135 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాలలో ఒక కోణం 100 డిగ్రీలు అయితే రెండవ కోణం ఎన్ని డిగ్రీలు ?
- వేగమునకు సూత్రం చెప్పండి?
- 4869 లో 8 యొక్క స్థాన విలువ ఎంత?
- 3896 కి విస్తరణ రూపం చెప్పండి?
- 2000+90+7 కి సంక్షిప్త రూపం చెప్పండి?
- 5×9 కి కూడిక రూపం చెప్పండి?
- 7+7+7+7+7+7+7+7= కి గుణకార రూపం చెప్పండి?
- 9×[ ]= 54
- 5×0 = ఎంత?
- నాలుగు అంకెల సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది?
- మూడంకెల సంఖ్యలలో చిన్న సంఖ్య ఏది?
- రెండంకెల గరిష్ట సంఖ్యకీ రెండంకెల చిన్న సంఖ్య కీ తేడా ఎంత?
- 3, 9, 5 లతో ఏర్పడే పెద్ద సంఖ్య ఎంత?
- పూర్ణ సంఖ్యల ను ఏ ఆంగ్ల అక్షరముతో సూచిస్తాము.?
- ౼95, 54 లలో ఏది పెద్ద సంఖ్య?
- ౼8 ని ౼1 తో భాగహరం చేసినట్లయితే జవాబు ఎంత?
- లవము పెద్ద గా ఉన్న భిన్నలను ఏమని పిలుస్తాము?
- హారము పెద్ద గా ఉన్న భిన్నాలను ఏమని పిలుస్తాము?
- అహ్మద్ పుట్టినరోజు న కోసిన కేక్ లో ⅘ భాగం పంచాడు. ఇంకా ఎంత భాగం కేకు మిగిలి ఉంది?
- a÷1= ఎంత?
- ఒకే హారము కలిగినటువంటి భిన్నాలను ఏమంటారు?
- ఒక పూర్ణాంకము మరియు క్రమ భిన్నము కలిగినటువంటి భిన్నాలను ఏమంటారు?
- దీర్ఘ చతురస్రం వైశాల్యం నకు సూత్రం చెప్పండి?
- 10, 100, 1000, …. మొదలగు హారాలు గలా భిన్నాలను ఏమంటారు?
- మూడు సంఖ్యల సామాన్య కరణాంకాలు 2, 3, 6, 12 అయితే వాటి గా.సా.భా ఎంత?
- 1 మిలియన్ కి ఎన్ని లక్షలు?
- పూర్ణాంకాలను ఏ ఆంగ్ల అక్షరముతో సూచిస్తాము?
- సహజ సంఖ్యలలో లేనిది పూర్ణాంకాలలో ఉన్న ఆ అంకె ఏమిటి?
- పూర్ణాంకాలలో అతి చిన్న సంఖ్య ఏది?
- 9÷0 = ఎంత?
- 1,2,3,4,5...… మొదలైన లెక్కించు సంఖ్యల సమూహమును ఏమని పిలుస్తాము?
- ఒక సంఖ్యను పూర్తిగా భాగించబడే సంఖ్యను ఏమని పిలుస్తాము?
- 12 యొక్క అన్ని కారణాంకంలు చెప్పండి?
- రెండే కరణాంకాలు కలిగినటువంటి సంఖ్యలు ఏమని పిలుస్తాము?
- ప్రధాన సంఖ్య కానిది, సంయుక్త సంఖ్య కానిది ఏమిటీ?
- ఒకట్ల స్థానంలో 0,2,4,6,8 అంకెలు ఉన్నటువంటి సంఖ్యలను ఏమని అంటారు?
- ఒక సంఖ్య లోని అంకెల మొత్తము 3, 6, 9 అయినటువంటి సంఖ్యలను ఏ సంఖ్యచే పూర్తిగా భాగించబడుతాయి?
- అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది?
- ఒక జత ప్రధాన సంఖ్య ల భేదం 2 అయినటువంటి ఆ జత ప్రధాన సంఖ్యలను ఏమని అంటారు?
- ఇవ్వబడిన సంఖ్యలకు (ప్రధాన సంఖ్యలు , సంయుక్త సంఖ్యలు కావొచ్చు) 1 అనే సంఖ్య మాత్రమే ఉమ్మడి కరణాంకము గల సంఖ్యలను ఏమని పిలుస్తాము?
ఇతర అంశాలకి సంబంధించిన ప్రశ్నలు:
- ప్రస్తుతం మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు? జ: రంనాధ్ కోవిద్
- ప్రస్తుత మహబూబాబాద్ కలెక్టర్ ఎవరు? జ: శివ లింగయ్య
- ఇటీవల పరమపదించిన మన దేశం మాజీ ప్రధాని పేరు ఏమిటి?
- రాత్రులు, పగలు ఎలా ఏర్పడతాయీ? జ: భూభ్రమణం వలన
- భారత జాతీయ కాంగ్రెస్ I.N.C ఎప్పుడు ఏర్పడినది? జ: 1885
- "వందేమాతరం" గీతం ఎవరు రాసినారు? జ: బంకించంద్ర చటర్జీ
- "భారతే దేశం నా మాతృభూమి" అనే ప్రతిజ్ఞను ఎవరు రచించినారు? జ: పైడిమర్రి వెంకట సుబ్బారావు
- పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు ఏమిటి? జ: లాక్టోబాసిల్లస్
- ఒకరోజు ఉష్ణోగ్రత ను ఏ పరికరంతో కొలుస్తారు? జ: సిక్స్ గరిష్ట కనిష్ట మాపకం
- భారత దేశ రాజ్యాంగాన్ని ఎవరు రచించారు ? జ:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
- భూమిలోపల లభించే ఖనిజాలు వాటి పేర్లు ఏమిటి? జ: ఇనుము , బొగ్గు , ముడిచమురు
- బెంగాల్ విభజన ఈ సంవత్సరంలో చేసినారు? జ: 1905
- "చింతకాయ" ను హిందీలో ఏమంటారు? జ: ఇమిలీ
- "నేను" అనే పదమును హిందీలో ఏమంటారు ? జ: మే
- భారతదేశం మధ్య గుండా పోయే అక్షాంశం పేరు ఏమిటీ? జ: కర్కట రేఖ
- బొగ్గుపులుసు వాయువు అని దేనిని అంటారు? జ: కార్బన్ డయాక్సైడ్
- భారతదేశము ఏ ఖండములో ఉన్నది ? జ:ఆసియా ఖండములో
- "నాయొక్క" అనే పదమును హిందీలో ఎలా చెబుతారు ? జ:మేరే
- మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు?జ: కేసిఆర్
- మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరు? జ: E. L Narasimhan
- మన తెలంగాణ రాష్ట్రం లోని జిల్లాల సంఖ్య ఎంత? జ: 31
- మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? జ: నరేంద్ర మోడి
- ఆదివాసి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపు కుంటాము ? జ: ఆగస్టు 9
No comments:
Post a Comment