Day 5 - 10th June 2025: బడిబాట కార్యక్రమాలు
👉 పాఠశాల వయసు ఉన్న పిల్లలను పాఠశాలల్లో నమోదు చేయడానికి ఇంటింటి ప్రచారం చేయుట.
👉 అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం.
👉 ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్చుకోవడంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు మరియు వారి చదువులు కొనసాగింపు కోసం ప్రయోజనాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలపై బ్రోచర్లు కరపత్రాలు మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
👉 గ్రామంలో బడి మానేసిన పిల్లలను(అసలు enrole కానివారిని / బడి మానేసిన వారిని) గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడం.
👉 ప్రత్యేక విద్య అవసరమయ్యే సి డబ్ల్యూ ఎస్ ఎన్ విద్యార్థులను గుర్తించి వారిని సమీపంలోని భవిత కేంద్రం లేదా పారిశ్రామిక విద్యా వనరుల కేంద్రంలో చేర్పించడం మరియు భవిత కేంద్రాలు ఐఆర్సిఎస్ లో వారు పొందే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం.
👉 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశానికి గుర్తించబడిన పిల్లలకు అడ్మిషన్ ఫారం (ఒకటి తల్లిదండ్రులకు అందజేయడానికి మరొకటి పాఠశాలలో ఉంచడానికి ) అందించాలి మరియు విద్యార్థులు మరియు తల్లిదండ్రులను స్వాగతించడానికి ఒక మొక్కను బహుమతిగా ఇవ్వాలి.
No comments:
Post a Comment