జూన్ 6 నుండి 19 వరకు బడిబాట రోజు వారి కార్యక్రమాలు
- 6వ తేదీన గ్రామసభ నిర్వహించాలి.
- 7వ తేదీన ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లలను గుర్తించాల న్నారు.
- 8 నుంచి 10 తేదీ వరకు కరప త్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి.
- 11 వ తేదీన ఈ నెల ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాలి.
- 12వ తేదీన అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలని, అదే రోజు విద్యార్థు లకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం లను అందించాలి.
- 13న సామూ హిక అక్షరాభ్యాసం, బాలలసభ
- 16న FLN &LIP దినోత్సవం నిర్వహించాలి
- 17న విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం నిర్వహించలి.
- 18న తరగతి గదుల డిజిటలీ కరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించాలి.
- 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలని సూచించారు.
బడిబాట 3వరోజు నుండి 5వ రోజు వరకు (8-6-25 నుండి 10-6-25 వరకు) షెడ్యూల్ ప్రకారం :-
గౌరవ జిల్లా విద్యాధికారి సూచనల ప్రకారం సమస్త ప్రధానోపాధ్యాయులకు తెలుపునది ఏమనగా
1) బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటకై ఇల్లు ఇల్లును తిరుగుతూ ప్రచారం చేయుట.
2) గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించుటకై తల్లిదండ్రులతో మాట్లాడుట.
3) ప్రచార సామాగ్రిని కరపత్రాలు ,పోస్టర్లు ,బ్యానర్లు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఉపయోగించే సాధనాలు, బడిలో ఉన్న మౌలిక వసతుల గూర్చి తల్లిదండ్రులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించి నమోదు చేయించుట నిలకడగా చదువును కొనసాగించేలా అవగాహన కల్పించుట.
4) బడిలో అసలే నమోదు కాని పిల్లలను మరియు బడి మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించుట.
5) ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి దగ్గరలో ఉన్న భవిత కేంద్రాలలో చేర్పించుట మరియు భవిత కేంద్ర సేవలను గూర్చి తెలియజేయుట.
6) పాఠశాలలో నమోదుకోసం గుర్తించిన విద్యార్థులకు అడ్మిషన్ ఫామ్ ఒకటి వారితల్లిదండ్రులకు అందించుట ఒకటి పాఠశాలలో రికార్డు చేయుట మరియు వచ్చిన పేరెంట్స్ కి ఒక మొక్కను కూడా ప్రోత్సాహకంగా స్వాగతం చెబుతూ అందించుట.
7). పాఠశాలలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతిదినం సంబంధిత ఎంఈఓ కార్యాలయానికి డాటా అందించుట.
No comments:
Post a Comment