ఎలుక, ఏనుగు స్నేహం (Mouse Elephant Friendship Story)
Teacher's Day Recognition: Sri Vemula Prakash of MPUPS Chinnvangara Honored as Best Teacher
గౌరవప్రదమైన గుర్తింపు: ఉత్తమ ఉపాధ్యాయునిగా శ్రీ వేముల ప్రకాష్ గారికి సన్మానం
05-06-2025 న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భంగా "పెద్దవంగర లైన్స్ క్లబ్" నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు MPUPS చిన్నవంగర పాఠశాలలో SGT టీచర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల ప్రకాష్ గారు పొందడం జరిగినది. పెద్దవంగర లైన్స్ క్లబ్ వారు MRC పెద్దవంగర నందు సన్మానము చేయడం జరిగినది.
కావున, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్రీ వేముల ప్రకాష్ గారికి అభినందనలు. మీ కృషి, అంకితభావానికి ఇది లభించిన గుర్తింపు. మీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.
Congratulations to Sri Vemula Prakash for receiving the Best Teacher award on the occasion of Teacher's Day. This is a well-deserved recognition of your hard work and dedication. We wish you continued success in your future endeavors.
From
HM and Staff
MP UPS Chinnavangara
Peddavangara
Mahabubabad
డిజిటల్ తరగతులు ప్రారంభం: చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో..
డిజిటల్ తరగతులు ప్రారంభం: చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం తేదీ : 07-07-2019 న డిజిటల్ తరగతులు ఇన్ఛార్జి ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, సర్పంచ్ లక్ష్మి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వినడం కంటే తెరపై చూడటం ద్వారా పాఠాలు ఎక్కువ కాలం గుర్తుంటాయన్నారు. విద్యార్థులు నూతన సాకేంతిక విద్యావిధానాన్ని శ్రద్ధతో వినియోగించుకుని చదువుల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు వారు ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

పేద విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, సన్నబియ్యం తో పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలు చెప్పే మాటలు నమ్మి తమ పిల్లల జీవితాలను ఆగం చేయొద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అర్హత కలిగిన ఉపాధ్యాయుడు ఉంటారన్నారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ సభ్యురాలు సౌజన్య, ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్, శ్రీనివాస్, ప్రకాష్, యాకూబ్ రెడ్డి, అజయ్ కుమార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Badi Bata Karapatram (Enrollment Drive pamphlet) 2025
Badi Bata Karapatram (Enrollment Drive pamphlet)
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల
గ్రామం: చిన్నవంగర, మండలం: పెద్దవంగర, జిల్లా: మహబూబాబాద్.
ఆంగ్ల మాధ్యమం (ENGLISH MEDIUM) ఉచిత విద్య (FREE EDUCATION)
గౌరవ తల్లిదండ్రులకు విద్యాభివందనములు!
విద్య ఒక సామాజిక అవసరం.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ కృత్రిమ మేదస్సు (AI)
తో నాగరిక పోటీ ప్రపంచంలో మనిషి మనుగడకు, మానవ
విలువలకు విద్య యొక్క పాత్ర అమూల్యమైనది. శాస్త్ర, సాంకేతిక పరమైన
కోర్సులను అభ్యసించడానికి "ఆంగ్ల మాధ్యమం” లో విద్య అవశ్యకమైనది.
నేటి ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో ప్రభుత్వేతర పాఠశాలలో వివిధరకాల అందమైన పేర్లతోఫీజులు
వసూలు చేస్తూ తల్లితండ్రులను తీవ్ర ఆర్థిక, మానసిక
ఇబ్బందులకు గురి చేసున్నాయి. తల్లిదండ్రులు తమ సంపాదనలో అధిక భాగం ప్రైవేట్ పాఠశాలలో
పిల్లల చదువు కొరకు ఖర్చు చేస్తున్నారు. తమ పిల్లలను మానసిక ఉల్లాసం లేని మర యంత్రాలుగా
తయారు చేస్తున్నారు.
మా ప్రత్యేకతలు:
- ప్రతి సంవత్సరం 2 ఉచిత ఏకరూప దుస్తులు (యూనిఫామ్స్)
- ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మరియు వర్క్ బుక్స్
- విద్యార్థులకు మానసిక ఒత్తిడి లేకుండా ఆంగ్ల మాధ్యమంలో పూర్తిగా విద్యా బోధన.
- ఉన్నత విద్యార్హతలు, అపార అనుభవం, సుశిక్షితులైన ఉపాధ్యాయ బృందం.
- ఉచిత మధ్యాహ్న భోజనం, రుచికరమైన పౌష్టికాహారం, వారానికి (3) రోజులు గుడ్లు, రాగిజావ.
- నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE).
- విద్యార్థులకు చక్కని గ్రంథాలయ సౌకర్యం.
- ప్రతి పాఠ్యాంశ బోధనానంతరం పరీక్షల నిర్వహణ. ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు పంపించడం.
- ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశములో విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయుల ముఖాముఖి.
- క్రీడా, సాంస్కృతిక మరియు సృజనాత్మక రంగాలలో ప్రత్యేక శిక్షణ.
- స్మార్ట్ స్క్రీన్, TLM ద్వారా విద్యా భోధన • ప్రతి రోజు యోగ, మెడిటీషన్, ఎక్సర్సైజ్ చేయించబడును.
- రైమ్స్, నీతి కథలు, స్పోకెన్ ఇంగ్లీష్.
- 1-8వ తరగతి వరకు విద్యాభోధన.
- స్వచ్చంద సంస్థలు, దాతల సహకారంతో పాఠశాల సుందరీకరణ,
విద్యార్థులకు అదనపు అవసరాలు తీర్చడం.
విశేష అనుభవం కలిగిన మా ఉపాధ్యాయ బృందం:
- G. దేవదాసు, B.A., B.Ed, HM SA (Social)
- J. రాజు, M.A., TPT SA (Telugu)
- G. నిఖిల్, B.Sc., B.Ed. SA (Bio-Sci)
- K. వెంకటేశ్వర్లు, M.Sc., B.Ed. SGT
- V. శ్రీనివాస్, M.Sc., B.Ed. SGT
- J. యాకూబ్ రెడ్డి, B.Sc., B.Ed. SGT
- V. ప్రకాష్, M.Sc., B.Ed. SGT
- D. ప్రకాష్, B.Sc., B.Ed. SGT
నాణ్యమైన విద్యకోసం మీ పిల్లలను
ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయండి.
ప్రభుత్వ బడులలో చదువులు
- మీ పిల్లల భవితకు వెలుగులు.
ఫీజులు ఎందుకు దండగ
- ఆంగ్ల మాధ్యమం మనఊరిలో ఉండగ...
సర్కారు
బడిలోనే చదివించండి - పిల్లల జీవితాలలో వెలుగుని పెంచండి.
గ్రామాలలో పాఠశాలలు - దేశానికి పట్టుగొమ్మలు.
మన
ఊరు మన బడిని మనమే కాపాడుకుందాం.
ప్రధానోపాధ్యాయులు
& ఉపాధ్యాయ బృందం,
అమ్మ ఆదర్శ పాఠశాల
కమిటి,
గ్రామం: చిన్నవంగర, మండలం: పెద్దవంగర.
School Reopening Invitation 2025
ప్రాథమికోన్నత పాఠశాల - చిన్నవంగర
పాఠశాల పున: ప్రారంభ ఆహ్వానం
గౌరవనీయులైన
తల్లిదండ్రులకు, విద్యాభిమానులకు, నమస్కారములు.
పాఠశాల వేసవి సెలవుల అనంతరం, రేపు అనగా జూన్ 12, గురువారం రోజున పాఠశాల పున:ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు పాఠశాల తరుపున ఆహ్వానం పలుకుతున్నాము. మన పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూల్ డ్రెస్ల పంపిణీ జరుగుతుంది. అలాగే తరగతుల ప్రారంభం జరుగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా తప్పనిసరిగా హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.
నేడే అడ్మిషన్లు ప్రారంభమైనవి.......
ఇట్లు
Day 3: 16-06-2025 - Badi Bata Programme Activities
The fallowing activities should be conducted for the Prof. Jayashankar Badi Bata programme on 16.06.2025, which is designated as Foundational Literacy & Numeracy (FLN), Learning Improvement Programme (LIP) day, are as follows:
- Conduct of activities as mentioned in guidelines (A) & (B), from 7:00 AM to 9:00 AM.
- Play FLN Song: Start the day with an audio song to invite children to school and create energy.
- Display Posters: Show colourful, subject-wise learning outcomes posters in all classrooms.
- Class Decoration: Children will prepare and display charts of key concepts like letters, numbers, shapes, etc.
- Read-Aloud Sessions: Teachers or volunteers will read simple and fun stories to children in groups.
- FLN Quiz Competition: Organize a fun quiz on basic reading and math (letters, words, simple sums, patterns, etc.).
- Learning Parade (Optional): Children and community members may walk through the village holding educational placards and slogans.
- Parents' Corner: Display children's work, show videos, or speak about school improvements and FLN efforts.
- Recognition Badges: Give "I Can Read" or "I Can Count" badges to children who perform well in quizzes or read-aloud sessions.
Day 9: 16th June 2025 బడిబాట కార్యక్రమాలు:
ఉదయం 7 నుండి 9 గంటల వరకు బడిబాట కొనసాగింపుగా enrolment drive చేయవలెను.
Primary Schools లలో FLN దినోత్సవం:
- FLN పాట ప్లే చేయవలెను. పిల్లలను పాఠశాలకు ఆహ్వానించే ఆడియో పాటతో రోజును ప్రారంభించండి.
- శక్తిని మరియు ఉత్సాహాన్ని సృష్టించండి.
- అన్ని తరగతి గదులలో రంగురంగుల సబ్జెక్టుల వారీగా అభ్యసన ఫలితాల పోస్టర్లను ప్రదర్శించడం.
- తరగతి అలంకరణ: అన్ని సబ్జక్ట్స్ LOs charts తయారు చేసి ప్రదర్శించవలెను.
- FLN క్విజ్ పోటీ: Basic reading and Maths ( letters, words, simple sums and patterns ) మొదలైనవాటితో సరదా క్విజ్ నిర్వహించుట.
- తల్లిదండ్రుల ఎదుట విద్యార్థి నైపుణ్యాలను ప్రదర్శించుట.
- గుర్తింపు Badges : నైపుణ్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు నేను చదవగలను, నేను లెక్కించగలను అను గుర్తింపు బ్యాడ్జీలను అందజేసి అభినందించవలెను.
High Schools లలో FLN దినోత్సవం:
- High Schools లలో LIP దినోత్సవం నిర్వహించవలెను.
- విద్యార్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించవలెను.
- తరగతి గదులలో అన్ని సబ్జెక్టుల LOs ప్రదర్శించవలెను.
- ముఖ్యమైన భావనల యొక్క Charts తరగతి గదులలో ప్రదర్శించవలెను.
- LIP కార్యక్రమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించవలెను.