READ - చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు

 READ - చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు

-ఫిబ్రవరి 5, 2022 నుండి - READ

-READ - Read Enjoy and Develop ( చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు )


కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రభావం వల్ల విద్యార్థులు చదవడంలో వెనకబడ్డారని 1 నుండి 9వ తరగతి విద్యార్థులు చదవడం పై దృష్టి సారించాలి అనే దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల్లో READ ప్రోగ్రాం రూపకల్పన చేయడం చాలా సంతోషదాయకం. చదువు ఆనందించు మరియు అభివృద్ధి చెందు అనే పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలో ప్రారంభించడం. నిస్సందేహంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. READ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలి.


గొప్పవారు కాగలరు

 నిజ జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానాలు చదవడం ద్వారానే లభిస్తాయి. గొప్పవారైన వారెవరైనా సరే మేధావులు, సంఘసంస్కర్తలు, శాస్త్రవేత్తలు, రచయితలు ఎవరైనా సరే చదవడం ద్వారానే వారు ఎంచుకున్న రంగంలో కృషిచేసి సమాజంలో గోప్పపపేరును సంపాదించారు. చదవడం అనే అలవాటును పెంపొందిచుకోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప జీవితాన్ని పొందవచ్చు. “చదవడం అనే అలవాటు మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాంతం సంపాదించిన జ్ఞానాన్ని పొందవచ్చు.” రోజులో కొంత సమయాన్ని తప్పకుండా చదవడం కోసం కేటాయించాలి.


నిరంతర ప్రక్రియ

 చదవడం మన నిత్య జీవితంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ. చదవడం అవసరంలేని చోటు అంటూ ఏదీ వుండదు. చదవడం నిత్యావసరం. చదవడం (READ) ఎంతో గొప్ప అలవాటు ఐనప్పటికీ చదివేవారిని ప్రోత్సహించడమే కాదు, అక్షరాలూ గుర్తుపట్టలేని విద్యార్థులూ వున్నారనే విషయాన్ని మరవద్దు. అక్షరాలు గుర్తుపట్టలేని విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తర్ఫీదు నివ్వాలి.  చదివించడం కేవలం ఉపాధ్యాయుల పనిగా భావించకూడదు. పిల్లల్ని చదివించంలో తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలి.


మౌలిక సదుపాయాల కల్పన

 “రేషనలైజేషన్ పేరుతొ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే ప్రయత్నం ఆపి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ప్రారంభించడమే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై కుడా దృష్టి పెట్టి ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణాన్ని విద్యార్థులకు అందించగలిగినట్టైతే బోధనాభ్యసన ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.” ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరగాలి.


ఇవేవి లేకుండా వినూత్నం పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు చివరికి ఇవి ఉపాధ్యాయులను బద్నాం చేసే ప్రోగ్రాంలుగా మిగిలిపోతాయి. పూర్తి సత్ఫలితాలను ఇవ్వలేవు. ప్రభుత్వం చేపట్టే విద్యాకార్యక్రమాలను ఎంతో గొప్పగా ప్రచారం చేసే మీడియా, ప్రభుత్వ పాఠశాలల్లో గల వసతుల గురించి కుడా విస్తృత ప్రచారం చేయాలి. విద్య అభివృద్దికోసం మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి యిప్పటి వరకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారడం లేదు.


ఉపాధ్యాయుల మద్దతు

 “ప్రభుత్వాలు విద్యా వ్యవస్థపట్ల చిత్తశుద్ధితో పనిచేసి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని పెంచాలి. ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నానని విద్యార్థి గర్వంగా చెప్పుకునే పరిస్థిని కల్పించాలి. గొప్పగా విద్యను పొందిన ఎన్నో పరీక్షలను దాటి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.”


అందరూ చదవాలి - అందరూ ఎదగాలి

Share:

No comments:

Post a Comment

Popular Posts

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.