100 రోజుల READ క్యాంపెయిన్ పై సూచనలు

100 రోజుల READ  క్యాంపెయిన్ పై  సూచనలు: సమస్త మండల విద్యాధికారులకు, Nodal HMs,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,KGBV  ప్రత్యేక అధికారులకు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు తెలియజేయునది ఏమనగా,

సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ గారు. పాఠశాలలోని పూర్వ ప్రాథమిక  తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు  తేదీ 05.02. 2022 నుండి 100 రోజుల పాటు పఠన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. 

విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి పఠనం ద్వారా భాషా మరియు నైపుణ్యం పెరగడానికి కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది.  పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలి.

 👉ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి. విద్యార్థులకు చదవడం ఒక అలవాటుగా మారాలి మరియు విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి..

▪️అందువలన ఈ కార్యక్రమమును క్రింది సూచనలతో ఖచ్చితంగా అన్ని పాఠశాలలలో నిర్వహించాలి. 

 👉విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ఒక పీరియడు కేటాయించాలి.

 👉పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీ గాని పెయింటింగ్ గాని చార్ట్ పై గాని READ PROGRAMME గురించి ప్రదర్శించాలి.

👉 చదువు- ఆనందించు-అభివృద్ధి చెందు  అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

👉 పాఠశాలలోని పుస్తకములను వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శింప చేయాలి.

👉 తరగతి వారీగా విద్యార్థులచే  గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయాలి. (ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతుల నుంచి ఐదుగురు విద్యార్థులతో గ్రంథాల కమిటీ ఏర్పాటు చేయాలి)

👉పాఠశాలలో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

👉 ఈ కార్యక్రమ నిర్వహణకు ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఎన్జీవోలను, సమాజ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి.

👉 ఇంటివద్ద చదవటానికి ప్రోత్సహించాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలి.

👉ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.  

👉నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 

👉ప్రధానోపాధ్యాయులు  ఈ కార్యక్రమంలో భాగంగా  విద్యార్థి వారిగా  వారి ప్రగతిని  రికార్డు  చేస్తూ మరియు సమీక్షిస్తూ   పనితీరు మెరుగుదలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సూచనలు చేయవలెను .

👉ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించ వలెను.

👉మండల విద్యాధికారులు, Nodal HMs, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ తమ మండలంలో,స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో  క్రమం తప్పక మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడం అయినది. -From: DEO Mahabubabad

Share:

No comments:

Post a Comment

Popular Posts

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.