తెలంగాణ విద్యాశాఖ రీడ్ కార్యక్రమం 2022

తెలంగాణ విద్యాశాఖ రీడ్ కార్యక్రమం 2022

READ (Read-Enjoy-And- Develop)

(చదువు-ఆనందించు-అభివృద్ధి చెందు)

👉విద్యార్థులలో పఠన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యం.

👉ప్రతి పాఠశాల లో 100 రోజుల పాటు నిర్వహించాలి.

👉 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు

👉 లైబ్రరీ పీరియడ్ ప్రతి తరగతికి ఉండాలి.

👉ప్రతి ప్రాథమిక పాఠశాల లో ఐదుగురు విద్యార్థులతో గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి.

👉ఉన్నత పాఠశాల ల్లో ప్రతి తరగతికి గ్రంథాలయ కమిటీ ఉండాలి.

👉ప్రాథమిక పాఠశాల ల్లో  లైబ్రరీ పీరియడ్ లో  వారం మొత్తంలో 4 రోజులు తెలుగు, రెండు రోజులు ఇంగ్లీషు నిర్వహించాలి.

👉ఉన్నత పాఠశాల ల్లో  3రోజులు తెలుగు, 2 రోజులు ఇంగ్లీషు, 1 రోజు హిందీ నిర్వహించాలి.

👉  ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి.

👉నెలకు ఒకసారి పఠనోత్సవం SMC, మరియు తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించాలి.

👉 READ కార్యక్రమ రిజిష్టర్ నిర్వహించాలి.

👉 విద్యార్థులలో చదవడం రాయడం రాని వారిని వచ్చిన విద్యార్థులతో జత చేయాలి. బొమ్మల కథల పుస్తకాలతో  వారిని ప్రోత్సాహించాలి.

👉 ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందరూ కలిసి , ప్రత్యేక టైం టేబుల్ ఏర్పాటు చేసుకొని నిర్వహించాలి. ప్రతి నెల సమీక్షా సమావేశం నిర్వహించుకోవాలి.

👉 ఈ నెల 14 నుండి 21 వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరపాలి. ముఖ్యముగా లైబ్రరీ పటిష్టత కోసం పుస్తకాల సేకరణ కై కృషి చేయాలి. 

👉 21 ఫిబ్రవరి నాడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరపాలి.

👉రాష్ట్ర ,జిల్లా, మండల స్థాయిలో మానిటరింగ్ బృందాలు పర్యవేక్షిస్తాయి.

Share:

100 రోజుల READ క్యాంపెయిన్ పై సూచనలు

100 రోజుల READ  క్యాంపెయిన్ పై  సూచనలు: సమస్త మండల విద్యాధికారులకు, Nodal HMs,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు,KGBV  ప్రత్యేక అధికారులకు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లకు తెలియజేయునది ఏమనగా,

సంచాలకులు, తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ గారు. పాఠశాలలోని పూర్వ ప్రాథమిక  తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వరకు  తేదీ 05.02. 2022 నుండి 100 రోజుల పాటు పఠన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. 

విద్యార్థుల్లో స్వతంత్రంగా పుస్తకాలు చదివే అలవాటును పెంచడానికి, వారిలో సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి మరియు విమర్శనాత్మక ఆలోచనలు కలిగించడానికి పఠనం ద్వారా భాషా మరియు నైపుణ్యం పెరగడానికి కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది.  పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహించాలి.

 👉ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి. విద్యార్థులకు చదవడం ఒక అలవాటుగా మారాలి మరియు విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి..

▪️అందువలన ఈ కార్యక్రమమును క్రింది సూచనలతో ఖచ్చితంగా అన్ని పాఠశాలలలో నిర్వహించాలి. 

 👉విద్యార్థులకు పుస్తకాలు చదవడానికి ఒక పీరియడు కేటాయించాలి.

 👉పాఠశాల ఆవరణలో ఫ్లెక్సీ గాని పెయింటింగ్ గాని చార్ట్ పై గాని READ PROGRAMME గురించి ప్రదర్శించాలి.

👉 చదువు- ఆనందించు-అభివృద్ధి చెందు  అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.

👉 పాఠశాలలోని పుస్తకములను వర్గీకరించి తరగతుల వారీగా ప్రదర్శింప చేయాలి.

👉 తరగతి వారీగా విద్యార్థులచే  గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేయాలి. (ప్రాథమిక పాఠశాలలో అన్ని తరగతుల నుంచి ఐదుగురు విద్యార్థులతో గ్రంథాల కమిటీ ఏర్పాటు చేయాలి)

👉పాఠశాలలో గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేసి గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

👉 ఈ కార్యక్రమ నిర్వహణకు ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఎన్జీవోలను, సమాజ భాగస్వామ్యాన్ని తీసుకోవాలి.

👉 ఇంటివద్ద చదవటానికి ప్రోత్సహించాలి.

👉 ఈ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్వహించాలి.

👉ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేయాలి.  

👉నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి 14 వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. 

👉ప్రధానోపాధ్యాయులు  ఈ కార్యక్రమంలో భాగంగా  విద్యార్థి వారిగా  వారి ప్రగతిని  రికార్డు  చేస్తూ మరియు సమీక్షిస్తూ   పనితీరు మెరుగుదలకు విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సూచనలు చేయవలెను .

👉ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రధానమైనదిగా భావించ వలెను.

👉మండల విద్యాధికారులు, Nodal HMs, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తమ తమ మండలంలో,స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో  క్రమం తప్పక మానిటరింగ్ చేస్తూ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించడం అయినది. -From: DEO Mahabubabad

Share:

READ - చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు

 READ - చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు

-ఫిబ్రవరి 5, 2022 నుండి - READ

-READ - Read Enjoy and Develop ( చదువు - ఆనందించు - అభివృద్ధి చెందు )


కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రభావం వల్ల విద్యార్థులు చదవడంలో వెనకబడ్డారని 1 నుండి 9వ తరగతి విద్యార్థులు చదవడం పై దృష్టి సారించాలి అనే దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల్లో READ ప్రోగ్రాం రూపకల్పన చేయడం చాలా సంతోషదాయకం. చదువు ఆనందించు మరియు అభివృద్ధి చెందు అనే పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఈ సమయంలో ప్రారంభించడం. నిస్సందేహంగా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. READ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ప్రైవేటు పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టాలి.


గొప్పవారు కాగలరు

 నిజ జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలకు సమాధానాలు చదవడం ద్వారానే లభిస్తాయి. గొప్పవారైన వారెవరైనా సరే మేధావులు, సంఘసంస్కర్తలు, శాస్త్రవేత్తలు, రచయితలు ఎవరైనా సరే చదవడం ద్వారానే వారు ఎంచుకున్న రంగంలో కృషిచేసి సమాజంలో గోప్పపపేరును సంపాదించారు. చదవడం అనే అలవాటును పెంపొందిచుకోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని ఆర్జించి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప జీవితాన్ని పొందవచ్చు. “చదవడం అనే అలవాటు మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక పుస్తకం చదవడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాంతం సంపాదించిన జ్ఞానాన్ని పొందవచ్చు.” రోజులో కొంత సమయాన్ని తప్పకుండా చదవడం కోసం కేటాయించాలి.


నిరంతర ప్రక్రియ

 చదవడం మన నిత్య జీవితంలో నిరంతరం కొనసాగే ప్రక్రియ. చదవడం అవసరంలేని చోటు అంటూ ఏదీ వుండదు. చదవడం నిత్యావసరం. చదవడం (READ) ఎంతో గొప్ప అలవాటు ఐనప్పటికీ చదివేవారిని ప్రోత్సహించడమే కాదు, అక్షరాలూ గుర్తుపట్టలేని విద్యార్థులూ వున్నారనే విషయాన్ని మరవద్దు. అక్షరాలు గుర్తుపట్టలేని విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తర్ఫీదు నివ్వాలి.  చదివించడం కేవలం ఉపాధ్యాయుల పనిగా భావించకూడదు. పిల్లల్ని చదివించంలో తల్లిదండ్రులు భాగస్వాములవ్వాలి.


మౌలిక సదుపాయాల కల్పన

 “రేషనలైజేషన్ పేరుతొ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే ప్రయత్నం ఆపి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వివిధ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ప్రారంభించడమే కాకుండా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై కుడా దృష్టి పెట్టి ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణాన్ని విద్యార్థులకు అందించగలిగినట్టైతే బోధనాభ్యసన ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది.” ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం జరగాలి.


ఇవేవి లేకుండా వినూత్నం పేరుతో ఎన్ని కార్యక్రమాలు చేపట్టారు చివరికి ఇవి ఉపాధ్యాయులను బద్నాం చేసే ప్రోగ్రాంలుగా మిగిలిపోతాయి. పూర్తి సత్ఫలితాలను ఇవ్వలేవు. ప్రభుత్వం చేపట్టే విద్యాకార్యక్రమాలను ఎంతో గొప్పగా ప్రచారం చేసే మీడియా, ప్రభుత్వ పాఠశాలల్లో గల వసతుల గురించి కుడా విస్తృత ప్రచారం చేయాలి. విద్య అభివృద్దికోసం మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి యిప్పటి వరకు ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారడం లేదు.


ఉపాధ్యాయుల మద్దతు

 “ప్రభుత్వాలు విద్యా వ్యవస్థపట్ల చిత్తశుద్ధితో పనిచేసి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలి. ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని పెంచాలి. ప్రభుత్వ పాఠశాలకు వెళుతున్నానని విద్యార్థి గర్వంగా చెప్పుకునే పరిస్థిని కల్పించాలి. గొప్పగా విద్యను పొందిన ఎన్నో పరీక్షలను దాటి ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.”


అందరూ చదవాలి - అందరూ ఎదగాలి

Share:

బాలల సంఘాలు

బాలల సంఘాలు

బాలల సంఘాలు అంటే బాలలతో ఏర్పరిచే సంఘాలే!

విద్యార్ధులే పాఠశాలల్లో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని బాధ్యత వహించడానికి బాలల సంఘాలు ఉపయోగపడతాయి.

ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఉపాధ్యాయుడు బాధ్యత వహించాలి. ప్రధానోపాధ్యాయుడు మానిటరింగ్‌ చేయాలి.

పాఠశాల స్థాయిలో ఈ క్రింది కమిటీలు విధిగా తమ విధులను నిర్వహించాలి. 

ప్రతి కమిటీలో తరగతికి ఒక్కరు చొప్పున అయిదుగురు ఉంటారు.


1. సమాచార కమిటీ:

బడిమానివేసిన / తరచు గైర్హాజరపుతున్న పిల్లల వివరాలు సేకరించి ఆ సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేయుట. ప్రార్ధనా సమావేశాలలో ప్రతి రోజు వార్తలు చదవడం.


2. ఆరోగ్య / పరిశుభ్రత కమిటీ:

పిల్లల పరిశుభ్రతను పరిశీలించడం, తరగతి గదిలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేయడం, వ్యాధుల పట్ల అవగాహన కలిగించుట.


3. ఆటలు / సాంస్కృతిక కమిటీ:

కాలనిర్ణయ పట్టిక ప్రకారం ఆటలు ఆడేలా చూడడం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో పాల్గొనడం.


4. గోడ పత్రిక కమిటి

ప్రతి రోజు పిల్లలు, టీచర్లు, రాసిన లేక తెచ్చిన కార్టూన్లు, కవితలు మొదలయిన ఇతర సమాచారం గీసిన బొమ్మలను గోడపత్రికలో ఉంచడం.


5. గ్రంథాలయ కమిటీ:

ప్రతిరోజు రీడింగ్‌ సమయంలో పిల్లలకు పుస్తకాలిచ్చి వాటి వివరాలను నమోదు చేయడం, పఠన సామగ్రిని సేకరించడం.


6. మధ్యాహ్న భోజన కమిటీ:

ప్రతి పాఠశాల నుండి తరగతికి ఇద్దరి చొప్పున విద్యార్ధులను ఎంపిక చేసి మధ్యాహ్న భోజన కమిటీ ఏర్పాటు చేసి వారి పేర్లు ప్రదర్శించాలి.

ఈ కమిటీకి చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయులు పి. ఇ .టి / ఆసక్తికరమైన ఉపాధ్యాయుడు ఇన్‌చార్జీగా ఉంటారు.

మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు, మెను ప్రకారం భోజనం తయారు చేస్తున్నారా, రుచికరంగా, శుభ్రంగా ఉంటుందా చూడాలి.

మధ్యాహ్న భోజన సమయంలో తరగతి వారీగా విద్యార్ధులను వరుసలలో నిలబెట్టి వారి ప్లేట్లు కడుక్కోనేటట్లు చూడాలి.

తరగతి వారీగా భోజనం అందించి కూర్చోనిబెట్టాలి.

అల్లరి కాకుండా చూడాలి.

పాఠశాల / తరగతి ఆవరణ శుభ్రంగా ఉండునట్లు Dust Bins ఉపయోగించునట్లు విద్యార్ధులకు అవగాహన కల్పించాలి.

వారికి తాగు నీటి వసతి అందునట్లు చూడాలి.

విద్యార్ధులందరు తిన్న తర్వాత, మధ్యాహ్న భోజన కమిటీ సభ్యులు తినాలి.

మాస వారీగా సమీ క్షించుకోవాలి. 

సమీ క్షలో తీసుకొన్న నిర్ణయాలు అమలగునట్లు చూడాలి


7. పాఠశాలలో నిర్వహించవలసిన కార్యక్రమాలు

ఉద్దేశ్యం: పిల్లల్లోని బహుముఖ ప్రతిభను వెలికితీయడానికి, మంచి వైఖరులను నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడానికి పిల్లల్లో సహకారం, సంఘీభావం కలిసి పనిచేయడం తమ వంతు వచ్చే వరకు వేచి ఉండడం, స్నేహభావం, స్వీయ క్రమశిక్షణ అలవర్చడం కోసం.


1.ప్రార్ధన:

  • పిల్లలచే స్వల్ప వ్యాయామ కృత్యాల నిర్వహణప్రార్ధన గీతాన్ని శ్రావ్యంగా, రాగభావయుక్తంగా, సామూహికంగా పాడించాలి.
  • రాష్ట్ర గీతం, ప్రతిజ్ఞను నిర్వహింపజేయాలి.
  • సేకరించిన నేటి వార్తలు చదివించాలి.
  • ఒక మంచి మాట (సూక్తి) చెప్పించాలి.
  • నేటి ప్రశ్న - మీ సమాధానంలో ప్రశ్నను అడగాలి.
  • బాలల సంఘాలచే పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతను పరిశీలింపజేయాలి. తగు సూచనలు అందజేయాలి.
  • ప్రాముఖ్యత గల రోజులల్లో ఆ రోజుకు సంబంధించిన సూచనలు అందజేయాలి.
  • పిల్లల డైరీ, గోడపత్రిక, స్కూల్‌ పోస్టు బాక్స్‌లోని మంచి ఉత్తరాలు రాసిన, మంచి అంశాలు ప్రదర్శించిన పిల్లలను అభినందించాలి, ప్రోత్సహించాలి.


 2.తరగతి గది గ్రంథాలయం:

పిల్లల అభిరుచికి తగినట్లుగా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గేయాలు, సమాచార సాహిత్యం పిల్లలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి చదివించాలి. పిల్లలతో వారు చదివిన పుస్తకాలపై సమీ క్షలు రాయించాలి.


 3.పిల్లల డైరీ:

పిల్లలు తమ ఆలోచనలు, ఇష్టాయిష్టాలను క్రమ పద్ధతిలో వ్యక్తీకరించే పుస్తకం. పిల్లల సహజ స్పందనలు అక్షర రూపంలో పొందేందుకై డైరీ ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఉపాధ్యాయుడు డైరీలను పరిశీలించాలి.


 4.గోడ పత్రిక:

పిల్లలు అభిప్రాయాలను వ్యక్తం చేయటం వారి హక్కు. గోడ పత్రిక వారి ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు, అభిప్రాయాలు, స్పందనలు వెలిబుచ్చే అవకాశం, వాతావరణం కలిగించేదిగా ఉంటుంది. కవితలు, గేయాలు, సూక్తులు, వార్తలు, కార్టూన్లు, వ్యాసాలు, జోక్స్‌, బొమ్మలు, తెలిసిన, రాసిన లేదా సేకరించిన సమాచారం మొదలైనవి ప్రదర్శించాలి. ప్రతి వారం గోడపత్రికలోని అంశాలను మార్చుతూ ఉండాలి.


 5.స్కూల్‌ పోస్ట్ బాక్స్:

పిల్లలు తమ అభిప్రాయాలను, సందేహాలను సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వేదిక పోస్టుబాక్స్ స్కూల్‌ పోస్టు బాక్స్ లోని అంశాలను ఉదయం ప్రార్ధన సమావేశంలో చదివి తోటి విద్యార్ధులకు వినిపించాలి


 6.మేళాల నిర్వహణ:

తెలుగు, గణిత, విజ్ఞానశాస్త్ర అంశాలకు చెందిన కృత్య సామగ్రిని, ప్రయోగాలను ఒక చోట చేర్చే ప్రదర్శించే వేదిక ఈ కార్యక్రమం ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు సమాజ సభ్యులకు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్గించే కార్యక్రమం, ప్రతి విద్యా సంవత్సరము కనీసం ఒకసారి నిర్వహించాలి


7.ఆవాస ప్రాంత కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేయటం:

ప్రతి పాఠశాల సిక్స్, కనిష్ట, గరిష్ట ఉష్ణమాపకాన్ని వినియోగించి పాఠశాల ప్రార్థన సమయంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రత వివరాలు చదవాలి. ఒక చార్టులో రోజు వారీగా ఉష్ణోగ్రతలు నమోదు చేసి వాటిని తరగతిలో విశ్లేషించాలి


8.వర్షపాతం నమోదు చేయటం:

ప్రతి పాఠశాల “వర్షమాపిణి’’ లేదా ప్లాస్టిక్‌ బాటిల్‌లో రూపొందించిన వర్షమాపణి ద్వారా వర్షపడిన సందర్భాలో వర్షపాత వివరాలు చార్టుపై నమోదు చేయాలి. నెల వారీగా వర్షం పడిన రోజులు, ఎన్ని సెం. మీ వర్షం కురిసిందో వాటి వివరాలను విశ్లేషించాలి. ప్రతి నెల ఒక రోజు ఉదయం ప్రార్ధన సమావేశంలో వాటిపై చర్చించాలి


9.వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధులకు గురయిన వారి సంఖ్య నమోదు చేయటం:

ఆవాస ప్రాంతంలోని విద్యార్ధులకు వివిధ కాలాలలో వచ్చే వ్యాధులు, వ్యాధికి గురైన విద్యార్ధుల సంఖ్య వివరాలు ప్రతి నెల నమోదు చేయాలి. వాటి వివరాలు స మీ పంలోని ఆరోగ్య కార్యకర్తకు / అందజేసి తిరిగి ఆయా వ్యాధులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలపై అవగాహన కలిగించాలి


10.కంపోస్టు, ఇంకుడు గుంత నిర్వహణ:

ప్రతి పాఠశాలలో ఒక మూలలో కంపోస్టు గుంత ఏర్పాటు చేయాలి. రాలిన ఆకులు, మధ్యాహ్న భోజన వ్యర్థ పదార్థాలు వాటిలో వేయాలి. మట్టి, నీరు వినియోగించి కంపోస్టు ఎరువు తయారు చేయాలి.


11.ప్లాస్టిక్‌, థర్మకోల్‌ వినియోగించకపోవటం:

పాఠశాలలో ప్లాస్టిక్‌, ధర్మకోల్‌తో తయారు చేసిన వస్తువులను వాడరాదు. పాఠశాల ఆవరణలో ప్లాస్టిక్‌ కాగితాలు వాడటం, పారవేయటం చేయరాదు. ప్లాస్టిక్‌ గ్లాసులలో టీ, నీరు తాగటం చేయరాదు. పాఠశాల బయట “ప్లాస్టిక్‌ థర్మకోల్‌ రహిత పాఠశాల’’ అనే బోర్డు ప్రదర్శించాలి


12.నిజాయితీ పెట్టె:

నిజాయితీ పెట్టె ద్వారా ఇతరుల వస్తువులు పిల్లలు తీసుకోకుండా, సంబంధిత వ్యక్తులకు అందజేసే పని జరుగుతుంది. ఏవైనా వస్తువులు నిజాయితీ పెట్టెలో ఉన్నపుడు ఉదయం పూట ప్రార్థన సమావేశంలో అందరి ముందు సంబంధిత వ్యక్తులకు అందచేయటంతో పాటు అవి నిజాయితీ పెట్టెలో వేసిన విద్యార్ధి వివరాలు తెలిపి అతని / ఆమె చర్యను అభినందించాలి.


13. పర్యావరణ - మిత్ర:

పాఠశాల పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండటానికి పర్యావరణ మిత్ర బాధ్యత వహిస్తుంది. కమిటీకి ప్రధానోపాధ్యాయుడు చైర్మన్‌గా, ఒక ఉపాధ్యాయుడు కన్వీనర్‌గా పనిచేస్తారు. ప్రతి తరగతి నుండి ఒక విద్యార్థిని ఎన్నుకోవాలి. ప్రతి తరగతిలో చెత్తబుట్ట ఏర్పాటు, పాఠశాల ఆవరణ, గదులు శుభ్రంగా ఉండేటట్లు చూడటం, మొక్కల పెంపకం, పక్షులు, జంతువులకు నీరు తాగటానికి తొట్టి, తినడానికి గింజల ఏర్పాటు, నీటిని వృధా చేయకుండా చూడటం వీ రి బాధ్యతలు.


14. “విందాం-నేర్చుకుందాం’’ రేడియో పాఠాలను విన్పించడం:

పాఠశాలలో రేడియో ఉందో లేదా చూడాలి. అది పని చేస్తుందో లేదో పరిశీలించాలి.పాఠశాలలో రేడియో పాఠాల షెడ్యూల్‌ అందుబాటులో ఉండాలి.పాఠశాలలో రేడియో పాఠాలు షెడ్యూల్‌ ప్రకారం పిల్లలకు వినిపించాలి.ఏ రోజు ఏ పాఠం వినిపించారో, ఒక నోట్‌ పుస్తకంలో వివరాలు రాయాలి.రేడియో పాఠాలను విన్నారో, లేదో పిల్లలను కూడా ప్రశ్నించి తెల్సుకోవాలి.

Share:

Popular Posts

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.