Health and Hygiene Kits Distribution to School Girls (విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజెనిక్ కిట్ల పంపిణీ ): బాలికల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యంలో Health Hygiene పంపిణీకి శ్రీకారం చుట్టిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నోజు విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం June 28, 2019 పెద్దవంగర మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల బాలికలకు హెల్త్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యత విషయంలో రాజీ పడకుండా పదమూడు రకాల వస్తువులతో కూడిన హెల్త్ కిట్లు మూడు నెలలకోసారి సంవత్సరంలో నాలుగు సార్లు అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి , ప్రకాష్, యాకూబ్ రెడ్డి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment