మంత్రముగ్దులను చేస్తున్న రెండు వేలాడే వంతెనలు: లక్నవరం.. తెలంగాణలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి సోయగం.. దట్టమైన అడవి.. చుట్టూ ఎత్తయిన కొండలు.. ఆ కొండల నడుమ సరస్సు.. సరస్సు మధ్యలో చిన్న చిన్న దీవులు.. వేలాడే వంతెనలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మొదటి వేలాడే వంతెనకు తోడు రెండో వేలాడే వంతెనను ఇటీవలే పర్యాటక శాఖ అందుబాటులోకి తెచ్చింది. దీంతో రోజు రోజుకు లక్నవరం సరస్సుకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది.


No comments:
Post a Comment