- వినయంలేని విద్య,సుగుణం లేని రూపం, సుదుపయోగం కాని ధనం, శౌర్యంలేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధమైనవి.- స్వామీ వివేకానంద.
- మనుషులను వారి డీగ్రీలను, మేధోసంపత్తిని చూసి అంచనా వేయకండి. అతని మనసును, ఆలోచనా విధానాన్ని బట్టి అంచనా వేయండి.- మహాత్మాగాంధీ.
- ఎంత గొప్ప స్థానానికి చెరినా సరే , విద్యార్థి గానే ఉండు . అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకువెళుతుంది. - సర్వేపల్లి రాధాకృష్ణన్
- విద్యను దాచుకోవడం కన్నా పంచితేనే మరింత పెరుగుతుండి.
- వినడానికి కటువుగా అనిపించినా , నీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహానే తీసుకో.
- చెడ్డవారికి సహాయం చేస్తే , మంచి వారికి కీడు చేసినట్లే .
- నోరు జారిన మాట..చేయి జారిన అవకాశం .. ఎగిరిపోయిన పక్షి.. గడిచిపోయిన కాలం .. తిరిగిరావు ..
- మేధావులు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు - గాంధీజీ
- మంచి పుస్తకం దగ్గరుంటే మనకు మంచి మిత్రుడు వెంటలేనిలోటు కనిపించదు .
- అందం అనేది నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాలలో కాదు.
- అసాధ్యమనేది మూర్ఖుని నిఘంటువులోని పదం .
- కష్టాలు ఎదురైనపుడే మనిషి విజయం విలువ తెలుస్తుంది .